Breaking News

ప్రతి పైసా పొదుపుకు ప్రత్యేక చర్యలు!

-విద్యుత్తు రంగంలో ప్రజా ధనం ఆదా చేయడమే లక్ష్యం
-చిన్న ప్రాజెక్టు నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు ప్రత్యేక దృష్టి
-అనేక చర్యలు తీసుకుంటున్న విద్యుత్తు సంస్థలు
-ఎస్ఏపీ టెండర్లలో రూ.15.96 కోట్లు ఆదా చేసిన ట్రాన్స్ కో
-ఒక రోజు ముందే విద్యుత్తు వినియోగాన్ని అంచనా వేసే సాంకేతికత
-ఫలితంగా కరెంటు కొనుగోళ్లపై నియంత్రణ
-విద్యుత్తు కొనుగోళ్లలో రూ.2342 కోట్లు ఆదా
-సాంకేతిక, వాణిజ్య నష్టాలు 13.79 నుంచి 10.95 శాతానికి తగ్గింపు
-విద్యుత్తు రంగంలో ప్రజాధనం ఆదాకు అనేక చర్యలు: శ్రీకాంత్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థలు తీసుకున్న అనేక చర్యలు, అనుసరిస్తున్న ఉత్తమ విధానాలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రజాధనం ఆదా అవడమేగాక విద్యుత్తు రంగం బలోపేతమవుతోంది. ప్రతి పైసా ఆదా చేసేందుకు విద్యుత్తు సంస్థలు కృషి చేస్తున్నాయి. చిన్న ప్రాజెక్టులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు ఉత్తమ ప్రమాణాలు పాటించటం, బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్తును కొనుగోలు చేయడంతో విద్యుత్తు సంస్థలు మొత్తంగా రూ.2342 కోట్లు ఆదా చేయగలిగాయి.
విద్యుత్తు సంస్థలు సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. నష్టాలను తగ్గించడంపై ప్రత్యేక నివేదికను విదుడల చేసిన ఆయన.. 2018-19లో 13.79 శాతంగా ఉన్న నష్టాలను 2019-20లో 10.95 శాతానికి తగ్గించగలిగినట్లు చెప్పారు. ఉత్తమ విధానాల అమలు, చౌక విద్యుత్తులో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీ విద్యుత్తు రంగాన్ని సుస్థిరం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా విద్యుత్తు సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు.
చౌక విద్యుత్తు, పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ ట్రాన్స్ కో ‘సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్స్ట్ (ఎస్ఏపీ)’, హన (హై పర్ఫార్మెన్స్ ఎనలిటిక్ అప్లయన్స్) ఎంటర్ప్రైజెస్ క్లౌడ్ సర్వీసులు (ఐదేళ్ల కాలానికి) టెండర్ల ఖరారులో రూ.15.96 కోట్లు ఆదా చేసింది. వాస్తవానికి ఎస్ఏపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఏపీ ట్రాన్స్ కో ఐదేళ్ల కిందట ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్లకు క్లౌడ్ సర్వీసులకు గాను రూ.20.22 కోట్లతో నామినేషన్ పద్ధతిలో ఒప్పందం జరిగింది. ఇదే కంపెనీ మరో ఐదేళ్ల పాటు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరగా.. ఏపీ ట్రాన్స్ కో తిరస్కరించింది. క్లౌడ్ సర్వీసుల కోసం ఓపెన్ టెండర్లు పిలిచినట్లు ట్రాన్స్ కో జేఎండీ కర్రి వెంకటేశ్వరరావు తెలిపారు. ఐదేళ్ల క్లౌడ్ సర్వీసులకు గాను ఆగస్టు 19న రూ.3.94 కోట్లకు, వన్ టైం మైగ్రేషన్ కోసం రూ.31.22 లక్షలకు టెండర్లు ఖరారు చేశామని వివరించారు. ఫలితంగా రూ.15.96 కోట్లు ఆదా చేసినట్లు చెప్పారు.
ఏపీ ట్రాన్స్ కో ఆన్లైన్ ఫైల్ క్లియరింగ్ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నట్లు శ్రీకాంత్ కు జేఎండీ వివరించారు. సాధ్యమైనంత వేగంగా అంటే 24 గంటల్లోపే ఫైళ్లను క్లియర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
చౌక విద్యుత్తు లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా విద్యుత్తు సంస్థలు ఇప్పటికే అనేక అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా ఒక రోజు ముందే విద్యుత్తు వినియోగాన్ని అంచనా వేసే ఏఐ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు ఖర్చును తగ్గించగులుతున్నట్లు చెప్పారు.
చౌక విద్యుత్తు విషయంలో ఏపీ విద్యుత్తు సంస్థలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయి. 2019-20, 2020-21 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థ లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం మరియు చౌక విద్యుత్ కే పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా కూడా విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా మొత్తం మీద రూ 2342 కోట్లు ఆదా చేశామని, దీన్ని కేంద్రం కూడా ప్రశంసించింది అని ఇంధన కార్యదర్శి పునరుద్ఘాటించారు.
నిరంతరం, అహర్నిశలు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయటంతో పాటు అందుబాటు ధరల్లోని కరెంటు అందించే విషయం పై దృష్టి పెట్టే కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించాలన్నది ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశమని, దీన్ని విద్యుత్ వ్యవస్థలు పాటిస్తాయని శ్రీకాంత్ చెప్పారు. చౌక విద్యుత్తు ద్వారా భారీగా ప్రజా ధనాన్ని ఆదా చేసిన విద్యుత్తు సంస్థలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించినట్లు ట్రాన్స్ కో సీఎండీ తెలిపారు.
డైరెక్టర్లు కె.ముత్తుపాండియన్, కె.ప్రవీణ్ కుమార్ లు తమ తమ విభాగాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను వివరించారు. చీఫ్ ఇంజనీర్, లక్ష్మి వార మీరా కుమార్, ఎఫ్ ఏ సి సి (ట్రాన్స్కో అకౌంట్స్ విభాగం)/ ఏ పీ ట్రాన్స్కో, మురళి కృష్ణ, చీఫ్ జనరల్ మేనేజర్, కేశవాచారి తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *