Breaking News

‘అపుడు ఇపుడు…’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సృజన్, తనీష్, హీరోహీరో యిన్లుగా యుకె ఫిలింస్ బ్యానర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణరాజు నిర్మాతలుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అపుడు ఇపుడు…’ శివాజీ రాజా , పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తు న్నారు. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు. ఈచిత్రం సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నారు. ఈ సంద్భంగా నిర్మాతలు మాట్లాడారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింద న్నారు. అందరూ మా చిత్రాన్ని ఆదరించారని అన్నారు. కాగా ఈచిత్రాన్ని దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కిం చారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చేనెల 3న విడుదల చేస్తున్నామని తెలిపారు. దర్శకు డు చలపతి పువ్వల మాట్లాడుతూ చిత్రం పూర్తి హంగులతో రూపొందించబడిందన్నారు. ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *