గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అరండల్ పేట, వసంతరాయపురం, మల్లికార్జున పేట, శ్రీనగర్, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, డ్రైన్ ఆక్రమణలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు సమర్దవంతంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి పని నిర్దేశిత గడువు మేరకు పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జాప్యం జరిగితే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఏఈల వారీగా రోడ్లపై ప్యాచ్ వర్క్ లను చేపట్టాలని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరా జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా శ్యాంపిల్స్ తీసి ప్రత్యేకంగా రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. అనంతరం అమరావతి రోడ్ లో, రోడ్ ఆక్రమణలను గమనించి, శంకర్ విలాస్ వంతెన పనులతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున రోడ్లు, డ్రైన్లపై ఆక్రమణల తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఆక్రమణల వలన ట్రాఫిక్ సమస్యతో పాటు డ్రైన్లలో మురుగుపారుదలకు అడ్డుగా ఉంటుందన్నారు. ఆక్రమణలను ఎట్టి పరిస్తితుల్లో ఉపేక్షించ వద్దని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు.
పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News