విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మెగా డీఎస్సీ-2025 నిర్వహించింది. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేయడమైనది. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చు. టెట్ వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ లో https://apdsc.apcfss.in హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే టెట్ వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వడమైంది. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే ఉంటుందని (13.08.2025) మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Tags vijayawada
Check Also
కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …
Prajavartha Online Telugu News