జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట పట్టణంలోని పురపాలక సంఘ పారిశుద్ధ్య అధికారులు, కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం పట్టణంలోని 3వ వార్డు సచివాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ కార్యాలయ పారిశుద్ధ్య కార్మికులు ఉదయాన్నే పనులకు హాజరు అయ్యే సమయంలో ఒక్క సచివాలయంలోనే పేర్లను నమోదు చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం విధులకు హాజరయ్యే పారిశుద్ధ్య కార్మికులను 4 విభాగాలుగా విభజించడం జరిగిందని, విధులకు హాజరయ్యే ముందు 4 వార్డు సచివాలయాల్లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వార్డు పరిధిలోని సచివాలయ సిబ్బంది పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రిపేర్ లో ఉన్నటువంటి పారిశుద్ధ్య చెత్త సేకరణ వాహనాలను త్వరితగతిన రిపేర్ చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పట్టణ పారిశుద్ధ్యం విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Tags jaggaiahpeta
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …