-మండలంలోని 4 గ్రామ సచివాలయల తనిఖీ
-ప్రతి ఒక్క మహిళచే దిశా యాప్ డౌన్లోడ్ చేయించండి
-జెసి (ఆసరా) పి. పద్మావతి
ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ను తీసుకుని మీ దగ్గర లోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా) పి. పద్మావతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, నాలుగు గ్రామ సచివాలయలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జే సి పద్మావతి మాట్లాడుతూ, మండలస్థాయి లోని అధికారులు వారి పరిధిలోని ప్రతి ఒక్క గ్రామ సచివాలయ గ్రామ వాలంటీర్లు ద్వారా 18 నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేల అవగాహన పెంచాలన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా లక్ష 35 వేల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచామన్నారు. సంబంధించిన మండల స్థాయి అధికారులు 100 శాతం లక్ష్యాలను సాధించాల్సి ఉందన్నారు. గ్రామ వాలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టి వారి పరిధిలో ఉన్న 50 కుంటుంబాల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వివరాలు సిద్ధం గా ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా రెండవ డోస్ కి చెందిన ప్రణాళికలు కూడా రూపొందించుకుని అధికారులకు తెలపాలన్నారు. అనంతరం ఉండ్రాజవరం మండలంలోని ఉండ్రాజవరం 1, 2 , కె.సావరం, పాలంగి గ్రామ సచివాలయాలను అధికారులతో కలిసి జె సి పద్మావతి తనిఖీ చేసి, అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. సచివాలయ మహిళ భద్రతా సిబ్బంది అందరూ ప్రతి మహిళా దిశా యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా గ్రామ సచివాలయ పరిధిలో ఎంతమందిచే దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్నది వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన పేదలకు అందించే దిశలో అడుగులు వేస్తోందని, వాటి ప్రయోజనం చేకూర్చే దిశలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు చెందిన “ఈ కె వై సి ” ని తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతు భరోసా ద్వారా లబ్ది పొందిన వారి డేటాను కూడా “ఈ కె వై సి ” పూర్తి చేయాలని పద్మావతి తెలిపారు. ఇప్పటి వరకు “ఈ కె వై సి ” చేసిన వాటి వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ పర్యటనలో జేసి వెంట ఉండ్రాజవరం తహసీల్దార్ జి. కనకరాజు, ఎంపిడిఓ జి. రమణ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.