Breaking News

కోవిడ్ టీకాలు పొందిన వారి వివరాలు అన్లైన్లో నమోదు చేయాలి…

-పోరంకి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విజయవాడ డివిజన్లో నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మంచి స్పందన లభించిందని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. మంగళవారం పెనమలూరు మండలం పోరంకి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ డివిజన్లో 56 వేల డోసులు వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 40 వేలు అర్బన్ ప్రాంతంలో 16 వేలు కోవిడ్ టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. అందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూరల్ ప్రాంతంలో 17 వేలు అర్బన్ ప్రాంతంలో 11,500 మంది కోవిడ్ టీతాలు పొందరన్నారు. డివిజనల్ లోని అన్ని మండలల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతుందన్నారు. ముఖ్యంగా 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు లోపుగల వారందరికి సచివాలయం ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు అందించడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి డేటా ఎంట్రీ అసైన్ చేయడం వేగవంతం చేయాలన్నారు.
అనంతరం పోరంకి గ్రామ సచివాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ మేర చేరువ చేస్తున్నది సచివాయంలోని సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ క్యాలండర్, ఇతర అంశాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించింది లేనిది ఆయన పరిశీలించారు. ప్రతి రోజు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరుగైన సేవలందించాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు కోవిడ్ నివారణ సూచనలు, వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన పరచాలన్నారు. గ్రామంలో పెన్షన్లు, రేషన్ పంపిణీ తీరును సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. ప్రతి వారం సోమ,మంగళ, బుధవారంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టార్లను ఆయన పరిశీలించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత సిబ్బందితో సమీక్షించారు. ప్రజలకు సేవలందించడంలో ఏ ఒక్కరూ కూడా జాప్యం , నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సక్రమంగ వెబ్ సైట్ నందు నమోదు చేస్తున్నది లేనిది ఆయన వాకబు చేశారు. ఇందుకు సంబంధించి పలు విషయాలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వీరి వెంట తహాశీల్దార్ భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *