Breaking News

నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా స్థానిక మాంటిస్సోరి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చి తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగులు ఉన్న పిల్లలు షోషకాహారలోపం, రక్తహీనతలతో అలసిపోవడమే కాకుండా శారీరక, మానసిక అభివృద్ధిలో మందకొడిగా వుంటారని చెప్పారు. అయితే పిల్లలకు నులిపురుగులు రాకుండా ఆల్బెండజోల్ మాత్రలు ద్వారా సులభంగా నియంత్రించవచ్చునన్నారు. నులిపురుగులను నిర్మూలించడం వల్ల రక్లహీనత నియంత్రణలోకి వస్తుందని, పోషకాహార అవసరాన్ని మెరుగుపరుస్తుందన్నారు. వ్యాధి నిరోధకత మెరుగవుతుందన్నారు. ఏకాగ్రత, నేర్చుకోగల సామర్థ్యం పిల్లలో పెరుగుతుందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు వేడిగా వున్న పదార్థాలే తీసుకోవాలన్నారు. ఈగలు,
దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్త పడలన్నారు. నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు 1-2 ఏళ్ళ పిల్లలకు 200 మి.గ్రా మాత్రలు ఆపైబడినవారు 400 మి.గ్రా మాత్రలను వేసుకుని బాగా నమలాలి అన్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 19 డివిజన్ కార్పొరేటర్ రేహానా, ఆరిబిఎస్ కి రాష్ట్ర నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిఇఓ తెహార సుల్తానా, డియంహెచ్ఓ యం, సుహాసిని డిప్యూటి డిఇఓ ఎల్. చంద్రకళ, ఆర్ ఎస్ కే జిల్లా కో-ఆర్డినేటర్ డా.యం.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *