-రాష్ట్రంలో 316 పరీక్షా కేంద్రాల్లో 74,853 మంది ప్రవేశపరీక్ష వ్రాయనున్నారు…
-ఉదయం 9.30 గంటలకే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలి…
-సాంకేతిక విద్యా కమిషనర్ పోలా భాస్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశపరీక్ష (POLYCET-2021) సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్రవ్యా ప్తంగా 316 పరీక్షా కేంద్రాలలో నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యాకమిషనర్ మరియు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణా మండలి ఛైర్మన్ డా. పోలా భాస్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. 1వ తేదీ (బుధవారం) ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలి సెట్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు మరియు ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండవ షిప్టు పాలిటెక్నిక్ కోర్స్ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పోలి సెట్-2021 పరీక్షకు సంబంధించి రాష్ట్రంలో 74 వేల 853 మంది ప్రవేశపరీక్ష వ్రాయనున్నారన్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని పరీక్షా కేంద్రాలవద్ద భద్రతా ఏర్పాట్లుతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పోలి సెట్ ఉమ్మడి ప్రవేశపరీక్ష వ్రాయనున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9.30 గంటలకు చేరుకోవాలని, ఉదయం 11 గంటల తర్వాత వచ్చినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని ఆయన అన్నారు. పరీక్ష వ్రాసే విద్యార్ధులు మాస్క్, హ్యాండ్ “జెస్ ధరించడంతో పాటు శానిటైజర్ తెచ్చుకోవాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్కానర్స్ ను ఏర్పాటు చేశామని, హ్యాండ్ శానిటైజర్స్ కూడా అందుబాటులో ఉంచామని శ్రీ పోలా భాస్కర్ అన్నారు. కోవిడ్-19 స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం సీటింగ్ ఎ రేంజ్ మెంట్స్ చేశామని, విద్యార్థికి విద్యార్థికి మధ్య
భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. స్పెషల్ ఐసోలేషన్ రూమ్స్ ను ఏర్పాటుచేశామని కోవిడ్ పాజిటివ్ అభ్యర్థులకు పిపిఇ కిట్స్ తో పాటు పరీక్షలు వ్రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు తమయొక్క హాల్ టిక్కెట్లను ఆగష్టు 25 నుండే డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని, ఎవరికైనా సాంకేతిక కారణాలవలన హాల్ టిక్కెట్లు లేకపోతే అటువంటి విద్యార్ధులు అందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలను చూపించిన వారికి పరీక్ష వ్రాసే అవకాశం కల్పిస్తామని సాంకేతిక విద్యాకమిషనర్ డా. పోలా భాస్కర్ అన్నారు.
Prajavartha Online Telugu News