Breaking News

కోవిడ్ కట్టడికి విజయవంతంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్… : కలెక్టర్ జె.నివాస్


-థర్డ్ ను దృష్టిలో పెట్టుకుని పకడ్బంది ఏర్పాట్లు…
-జిల్లాలో ఇప్పటివరకు 27,78,588 మందికి కోవిడ్ టీకా…
-సాయంత్రం 6 గంటలకే 1,20,727 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మంగళవారం చేపట్టిన మరో ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సంపూర్ణంగా విజయవంతమైంది. అన్ని గ్రామ సచివాలయాల ద్వారా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచే 18 నుండి 45 వయస్సులోపు, 45 ఏళ్లు పైబడ్డ వారు ఉదయం 7 గంటలకే వ్యాక్సిన్ కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ముందుగానే అన్ని మండలాల్లో సోమవారం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సచివాలయాల వారిగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సులోపు గలిగిన వారి జాబితాలను రూపొందించుకుని అందుకు తగిన ప్రణాళికతో మంగళవారం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. విఆర్వో, విఏవో, ఎఎన్ఎం, ఆశా కార్యకర్త నలుగురు కలసి కట్టుగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. గ్రామ సచివాలయ వాలంటీర్లు వ్యాక్సిన్ తీసుకోవాలసిన వారిని గుర్తించి ఉదయమే టీకా కేంద్రాలకు తీసుకువచ్చి వ్యాక్సిన్ పొందేందుకు సమాయత్తం చేశారు. ఉదయం 9 గంటలకే భారీగా జనం రావడంతో మండల అధికారుల్లో కూడా ఉత్సహాం వచ్చింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన వ్యాక్సిన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో వ్యాక్సిన్ ప్రక్రియ సులభతరమైంది. గత శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 89 వేల మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నారు. అందువల్ల కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ పెట్టి మండల అధికారులను ఏవిధంగా నిర్వహించాలో దిశానిర్దేశం చేశారు. అందుకే సాయంత్రం 6 గంటలకే 1,20,727 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. లక్ష 30 వేల వ్యాక్సిన్ డోసులు సచివాలయాల్లో అందుబాటులో వుంచారు. అయితే ఆ లక్ష్యాన్ని చేధించే దిశగా ఇంకా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతూనే వుంది. ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ జె.నివాస్, కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ సచివాలయం పరిధిలో అర్హులైన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్ శివశంకర్ పటమటలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. డియం హెవో యం. సుహాసిని కూడా ఆయన వెంట ఉన్నారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కె. మాధవిలత కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్ ప్రవీణ్ చంద్, పెనమలూరు మండలం పోరంకలను వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించారు. గుడివాడ ఇన్‌ఛార్జి ఆర్డీవో ఎస్ఎస్ స్ ఖాజావలి గుడ్లవల్లేరులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఇది ఇలా వుండగా జిల్లాలో ఇంతవరకు 28,17,302 మంది కోవిడ్ టీకాలు పొందారు. వీరిలో 20,72,470 మంది మొదటి డోసు పొందగా 7,44,832 మంది రెండవ డోసు కోవిడ్ టీకాలను పొందారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *