Breaking News

కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత చేంజ్ మేకర్స్ ది…


-300 మంది జైపూర్ ఫుట్స్ అంద‌జేత…
-దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు
-ది. చేంజ్ మేకర్స్ సేవ‌లు అద‌ర్శ‌నీయం : క‌లెక్ట‌ర్
-మ‌రిన్ని సేవ కార్య‌క్ర‌మాలు చేయాలి : మేయ‌ర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాళ్ళు కోల్పోయిన నడవలేని అనేక మందికి నడక నేర్పిన ఘ‌న‌త ది చేంజ్ మేకర్స్ కు చెందుతుంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో సి. రెడ్డి చార్జీస్ నందు ది చేంజ్ మేకర్స్ అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్‌, దుర్గ‌గుడి చైర్మ‌న్ పైలా సోమినాయుడు, కార్పొరేట‌ర్లుల‌తో క‌లిసి జైపూర్ ఫుట్స్ ఉచితంగా పంపిణి చేశారు. పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు, ప్ర‌మాదాల్లో కాళ్ళు కోల్పోయిన అనేక మందికి వారి జీవితాలలో వెలుగు నింపిన చేంజ్ మేకర్స్ నిర్వ‌హ‌కుల‌ను మంత్రి అభినందించారు.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారికి వైద్య ప‌రీక్ష‌లు చేసి, వారికి స‌దుపాయ‌లు క‌ల్పించ‌డంతో పాటు దాదాపు 300 మందికి ఉచితంగా జైపూర్ ఫుట్స్ అందించ‌డం అభినంద‌నీయం అన్నారు..

ది. చేంజ్ మేకర్స్ సేవ‌లు అద‌ర్శ‌నీయం… : క‌లెక్ట‌ర్
కాళ్లు లేకుండ ఇబ్బంది ప‌డుతున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా సేవ‌లు అందించ‌డం మంచి విష‌యం అన్నారు. అదే విధంగా జైన్ స‌మాజం వారు అందిస్తున్న సేవ‌లు గ‌తంలో నేను క‌మిష‌న‌ర్ గా పాల్గొనడం జ‌రిగింది. జైన్ క‌మిటీ వారి నిస్వార్థ సేవ‌లు అభినంద‌నీయం అన్నారు. యువ‌కులు మంచి అలోచ‌న‌తో ది చేంజ్ మేకర్స్ ఏర్పాటు చేయ‌డం, ఉచితంగా ఇంత‌మంది సేవ‌లు అందించిన‌ యువ‌త ప‌లువురికి ఆద‌ర్శం అన్నారు.

మ‌రిన్ని సేవ కార్య‌క్ర‌మాలు చేయాలి… : మేయ‌ర్ 
యువ‌త మ‌రింత మందికి ఆద‌ర్శంగా నిల‌వ‌డం మంచి విష‌యం అని న‌గ‌ర మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి అన్నారు..ది. చేంజ్ మేకర్స్ అధ్వ‌ర్యంలో న‌గ‌రంలో మ‌రిని సేవ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని అందుకు కావాల‌సిన పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు జైపూర్ ఫుట్స్ కావాలంటే హైద‌రాబాద్ వెళ్ల‌వ‌ల‌సి వ‌చ్చేంద‌ని… జైన్ స‌మాజం యువ‌త నేడు విజ‌య‌వాడ‌లో మూడు రోజులు శ్ర‌మించి దాదాపు 300 మంది జైపూర్ ఫుట్స్ అందించ‌డం అభినంద‌నీయం అన్నారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు కార్పొరేట‌ర్లు, నిర్వ‌హ‌కులు ప‌లువురు వైద్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *