-పెళ్లి పీటలు ఎక్కల్సిన వరుడు పింఛను కానుక అందిస్తూ…
-బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సామాజిక పెన్షన్లు 88.45 శాతం పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, ఉత్సహాంగా ప్రారంభమైంది. పెన్షన్‌దారుల వద్దకు వాలంటీర్లు వెళ్లి పెన్షన్ డబ్బులు అందించడంపై లబ్దిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిపీటలు ఎక్కల్సిన గంపలగూడెంకు చెందిన వాలంటీర్ కోట శివ తన పెళ్లిరోజే తలకు బాసికంతో తెల్లవారు జామునుంచే పెన్షన్లను పంపిణీ చేయడం సంబరమనిపింఛన్ అనిపించింది. కృష్ణాజిల్లాలో వృద్ధాప్య, వితంతువు తదితర సామాజిక పెన్షన్లు క్రింద సెప్టెంబరు,2021 మాసపు పెన్షన్లు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 88.45 శాతం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతువు తదితర సామాజిక పెన్షన్లు పొందుతున్న 4,97,741 మందికి రూ.115.28 కోట్లు పెన్షన్ చెల్లింపుకుగాను వారిలో బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి 88.45 శాతం పెన్షను పంపిణీ చేశారు. రూ. 102,03 కోట్లు (88.45 శాతం) మందికి పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో పెన్షన్ పంపిణీల్లో మచిలీపట్నం మండలంలో అత్యధికంగా 10,664 మందికి గాను 10,168 (95, 35 శాతం) పంపిణీ చేసి ప్రథమ స్థానంలో నిలవగా, 9031 మందికి గాను 7,128 మందికి (78,93 శాతం) చందర్లపాడు మండలం చివరి స్థానంలో నిలిచింది. అర్బన్ మండలానికి సంబంధించి మచిలీపట్నం 92, 92 శాతం, ఉయ్యూరు మున్సిపాలిటిలో 92.48 శాతం పెన్షన్ పంపిణీ కాగా, విజయవాడ అర్బన్లో 92.74 శాతం, పెడన 87.85 శాతం, నూజివీడు 90.86 శాతం, గుడివాడ 90.79 శాతం, నందిగామ 90.04 శాతం, తిరువూరు 88, 34 శాతం, జగ్గయ్యపేట మున్సిపాలిటిలో 88.90 శాతం, కొండపల్లి 86.71 శాతం పెన్షన్ల పంపిణీ చేయబడ్డాయి.