Breaking News

మరమత్తులు చేపట్టవలసిన క్లాసు రూమ్ లకు అంచనాలు రూపొందించాలి…

-పాఠశాలలో విధిగా కోవిడ్ నిభందనలు పాటించాలి…
-అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలల్లో అత్యవసర సౌకర్యాలు కల్పించుటకు చేపట్ట వలసిన చర్యలపై గురువారం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ‌ తనిఖి చేసారు. నగర పరిధిలోని మూడు పాఠశాల్లో శిదిలామైన భవనాలైన దుర్గాపురంలోని శ్రీ T.వెంకటేశ్వరరావు ఉన్నత మరియు ప్రాధమిక  పాఠశాలలను సందర్శించి పెచ్చులూడిన గదులను, దెబ్బతిన్న కిటికీలు – గోడలను పరిశిలించి వెంటనే వార్డ్ ఎనిమిటిస్ సెక్రటరి శ్రీ అబ్దుల్ రహీమ్ కు ఎస్టిమేషన్ వేసి పంపవలసినదిగా ఆదేశించారు హైస్కూల్ మరియు ప్రైమరీస్కూల్ తరగతుల విద్యార్ధులు మరియు టిచర్లతో ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం సత్యనారాయణపురంలోని ప్రశాంతి  ప్రాధమిక  పాఠశాల మరియు AKTPM  హైస్కూల్ సందర్శించి అక్కడ  ఎనిమిటిస్ సెక్రటరి నాగరాజు కు కూడా ఎస్టిమేషన్ వివరాలు సేకరించారు. AKTPM  హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు S.శ్రీనివాసరావు పాఠశాలలో 1850 మంది విద్యార్ధులతో అదనపు తరగతుల అవసరమని ప్రస్తావించగా వెంటనే ప్రపోజల్స్ పంపవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్భంగా ప్రతి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అందరూ కోవిడ్ నిభందనలు పాటిస్తూ  పాఠశాల కార్యకమలు నిర్వహించాలని, మద్యాహ్నం భోజన సమయంలో పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యకమoలో పాఠశాలల సూపర్వైజర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గోన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *