-కోటి రూపాయలతో డి.ఆర్. ఆర్ ఇండోర్ స్టేడియం అధునీకరణ పనులు…
-111, 112 సచివాలయాల ఆకస్మిక తనిఖీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురువారం కృష్ణలంక 23వ డివిజన్‌లో ని 111, 112 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై ఇచ్చే దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కోటి రూపాయలతో డిఆర్ ఆర్ స్టేడియం అధునీకరణ పనులు…
15 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు కమిషనర్ అదేశం
బందర్ రోడ్డులోని డి.ఆర్.ఆ.ర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. కోటి రూపాయలతో అధునీకరణ పనుల్లో భాగంగా జిమ్, 4 షటిల్ కోర్టు నిర్మాణ పనులు, స్టేడియం లోపల బయట పెయింగ్ పనులు, గ్యాలరీ నిర్మాణం, స్టేడియంలో ఉడేన్ పోలింగ్ నిర్మాణం పనులను 15 రోజులోగా పూర్తి చేయాలని అధికారులకు కమిషనర్ అదేశించారు.
పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, ఆర్.ఎఫ్.ఓ / స్పోర్ట్స్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఉదయ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫణింద్ర మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News