Breaking News

కోవిడ్‌ – 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం  వైఎస్‌ జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్‌ – 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  గురువారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ…
కోవిడ్‌ పరిస్ధితులపై సీఎం సమీక్షా సమావేశం

– కోవిడ్‌ పరిస్థితులను వివరించిన అధికారులు
– థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు.

రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు

– రాష్ట్రంలో 2.11 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
– మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో 3 శాతానికి లోపలే పాజిటివిటీ రేటు
–గడచిన మే నెలలో గరిష్ట కేసుల సంఖ్య 2,11,554 నుంచి ప్రస్తుతం 14,473కి తగ్గిన పాజిటివ్‌ కేసులు
–దాదాపు 10వేల గ్రామ సచివాలయాల పరిధిలో కేసుల్లేవు
– రికవరీ రేటు 98.58 శాతం
– 104 సెంటర్‌కు వచ్చే కాల్స్‌ సంఖ్య 775కు తగ్గుదల. మేనెలలో గరిష్టంగా 19,175 కాల్స్‌.
– ఇప్పటికి 17 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే

థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్నిరకాలుగా సిద్ధమయ్యామని తెలిపిన అధికారులు
– ఇప్పటికే 20,964 ఆక్సిజన్‌ కాన్‌ సన్‌ట్రేటర్లు సిద్ధం. మరో 2493 కూడా సమకూర్చుకుంటున్నామన్న అధికారులు
– 27, 311 ఆక్సీజన్‌ డి–టైప్‌ సిలెండర్లు సిద్దంచేశామన్న అధికారులు
– సెప్టెంబరు నెలాఖరు నాటికి 95 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌పైపులైన్ల పనులు పూర్తి. ఇప్పటికి 50 ఆస్పత్రుల్లో పూర్తి. మొత్తం 143 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల పనులు.
– పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిని కూడా వివరించిన అధికారులు.

వ్యాక్సినేషన్‌ :

– ఇప్పటివరకూ రాష్ట్రంలో 3,02,52,905 డోసులు వ్యాక్సినేషన్‌.
– 2,18,04,564 మందికి వ్యాక్సినేషన్‌.
– ఇందులో 1,33,56,223 మందికి సింగిల్‌ డోస్‌.
– 84,48,341 మందికి రెండుడోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి.
– నవంబర్‌ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ఇస్తామన్న అధికారులు.
– వచ్చే ఫిబ్రవరి చివరినాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయన్న అధికారులు.
– వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కోవిడ్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అ«ధ్యయనం చేయాలన్న సీఎం.
– వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో ప్రభావాలను అధ్యయనం చేయాలన్న సీఎం.
– బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలంటూ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్నదానిపై ఒక ఆలోచన కూడా చేయాలని సీఎం ఆదేశం.
– రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూరై్తన తర్వాత ఏరకంగా అడుగులు ముందుకేయాలన్న దానిపై సరైన ఆలోచనలు చేయాలన్న సీఎం.

కర్ఫ్యూ కొనసాగింపు:

– రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగింపు.
– కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్‌లో జాగ్రత్తలు పాటించాలన్న సమావేశంలో పాల్గొన్న వైద్యులు
– వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్న వైద్యాధికారుల సిఫార్సు.
– ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, పబ్లిక్‌ స్థలాల్లో విగ్రహాలు వద్దని వైద్యాధికారుల సిఫార్సు.
– నిమజ్జన ఊరేగింపులు వద్దని వైద్యాధికారుల సిఫార్సు.
– ఈమేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం.
– ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవన్న సీఎం.
– ఈమేరకు మార్గదర్శకాలు జారీచేయనున్న వైద్య ఆరోగ్యశాఖ

సిబ్బంది లేరనే మాట వినిపించకూడదు:

– ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకంపై సీఎం సమీక్ష.
– ఖాళీలు గుర్తించి 90 రోజుల్లోగా వారిని నియమించేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష.
– ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదన్న సీఎం.
– నియామకాలు పూర్తైన తర్వాత డిప్యుటేషన్‌ అనే మాట వినిపించకూడదన్న సీఎం.
– బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.
– ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందుల రాకూడదన్న సీఎం.
– ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని సీఎం ఆదేశం.
– ప్రభుత్వ ఆసత్పుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న సీఎం.
– డబ్ల్యూ హెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉండాలన్న సీఎం.
– ఈమేరకు అధికారులు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ చేయాలన్న సీఎం.

ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకారదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *