విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఈ రోజు అనగా 03 సెప్టెంబర్, 2021 తేదీన విజయవాడ డివిజన్ పరిధిలోని కాకినాడ పోర్టు-రాజమండ్రి-నిదడవోలు-భీమవరం-నరసాపూర్ సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట విజయవాడ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ తనిఖీలలో పాల్గొన్నారు.
జనరల్ మేనేజర్ కాకినాడ పోర్డు రైల్వే స్టేషన్ నుండి తనిఖీలు ప్రారంభించి అక్కడ అందుబాటులో ఉన్న ప్రయాణికుల వసతులను పరిశీలించారు మరియు స్టేషన్ అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. కాకినాడ పోర్టు సైడిరగ్‌ను సందర్శించిన గజానన్ మాల్య నూతన సైడిరగ్‌లో హమాలీల భోజనశాల మరియు సిబ్బంది విశ్రాంతి గదితో పాటు అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన జనరల్ మేనేజర్ అక్కడ సరుకు రవాణా వినియోగదారులతో మాట్లాడారు. జనరల్ మేనేజర్ కాకినాడ టౌన్`సామర్లకోట సెక్షన్‌లో ప్రత్యేక రైలు ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ ట్రాక్ నిర్వహణ మరియ భద్రతను సమీక్షించారు. అనంతరం, ఆయన సామర్లకోట రైల్వే స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని, స్టేషన్ సర్క్యులేటింగ్ ఏరియాను, ప్రయాణికుల వసతులను తనిఖీ చేశారు. ఆయన అక్కడి గూడ్స్ షెడ్‌లోని సౌకర్యాలను సమీక్షించి హమాలీ కార్మికులతో మాట్లాడారు. పిదప, ఆయన సామర్లకోటలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను తనీఖీ చేసి, అక్కడి సిబ్బందితో సంభాషించారు. ఆయన బిక్కవోలు రైల్వే స్టేషన్‌లో కూడా తనిఖీలు నిర్వహించారు.
రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన జనరల్ మేనేజర్ మొత్తం స్టేషన్ పరిసరాలను, స్టేషన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరీక్షించారు మరియు అధికారులతో చేపట్టాల్సిన మరిన్ని అభివృద్ధి పనుల ప్రణాళికలపై చర్చించారు. రాజమండ్రిలో ఆరోగ్య కేంద్రాన్ని మరియు గూడ్స్ షెడ్‌ను ఆయన పరిశీలించారు. తనిఖీలలో భాగంగా ఆయన రాజమండ్రి`నిడదవోలు సెక్షన్ మధ్య ప్రత్యేక రైలులో ప్రయాణించి ట్రాక్ నిర్వహణను సమీక్షించారు. శ్రీ గజానన్ మాల్య నిడదవోలు స్టేషన్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. నిడదవోలు`నరసాపూర్ సెక్షన్ మధ్య నిర్మాణంలో ఉన్న డబ్లింగ్ పనుల పురోగతిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) అధికారులు ఇచ్చిన ప్రణాళికలను పరిశీలించారు. అనంతరం, ఆయన తణుకు, భీమవరం, పాలకొల్లు, మరియు నరసాపూర్ రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించి అక్కడి ప్రయాణికుల వసతులను పరీక్షించారు మరియు అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.
తనిఖీలలో భాగంగా జనరల్ మేనేజర్ కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ఎమ్.భరత్ రామ్‌తో వారి ప్రాంతాలకు సంబంధించిన వివిధ రైల్వే అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. పిదప నిడదవోలు మున్సిపల్ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు గజానన్ మాల్యను కలిసి నిడదవోలుకు సంబంధించిన రైల్వే అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. తనిఖీల కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన గజానన్ మాల్య రైల్వేలో వివిధ సౌకర్యాల అభివృద్ధి ప్రణాళికలను వారికి క్లుప్తంగా వివరించారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …