Breaking News

డూండీ గణేష్ ని దర్శించుకున్న సినీ హీరో మంచు మనోజ్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త
డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని విద్యాధరపురం, సితార సెంటర్, లేబర్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహా శక్తి గణపతిని, 21 అడుగుల శ్రీ నగరేశ్వర స్వామి మరియు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని సినీ హీరో మంచు మనోజ్ శనివారం దర్శించుకున్నారు. హీరో మంచు మనోజ్ బృందం అంతా వచ్చి గణేష్ ని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ని గణేష్ సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మూడేళ్ల పాటు శ్రమించి తీసిన మిరాయ్ చిత్రం ఈనెల 12న విడుదలవుతుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, పలువురు ప్రముఖులకు నిర్వాహకులు వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడి ఆశీస్సులు అందించారు. కార్యక్రమ నిర్వాహకులు డూండి గణేష సేవా సమితిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డూండీ సేవా సమి తి వ్యవస్థాపకుడు డూండీ రాకేష్ తో పాటు డూండి గణేష సేవా సమితి కార్యవర్గం సభ్యులు, నగర ప్రముఖులు, భక్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *