విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విదేశీ విద్య పథకం క్రింద అర్హులు అయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళిన కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలకు చెందిన విద్యార్దిని విద్యార్దులు యొక్క తల్లితండ్రులు శుక్రవారం కాపు కార్పొరేషన్ కార్యాలయంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడపా శేషగిరి ని మర్యాదపూర్వంగా కలిసినారు. అనంతరం చైర్మన్ తో మాట్లాడుతూ విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించుతున్న అర్హులైన తమ పిల్లలకు విడుదల చేయవలిసిన విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, తమ తరపున ముఖ్య మంత్రి తో మాట్లాడి బకాయి నిధులాను విడుదల చేయవలిసిందిగా చైర్మన్ కి ఆర్జీలను సమర్పించారు.