Breaking News

స్వమిత్వతో గ్రామాల్లో భూ సమస్యలకు పరిష్కారం… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వమిత్వ సర్వేతో గ్రామాలలోని భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సమిష్టిగా అంకితభావంతో సర్వేను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని రెవిన్యూ కళ్యాణ మండపంలో జిల్లా పంచాయితీ ఆధ్వర్యంలో స్వమిత్వ సర్వేపై రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు, సచివాలయ సిబ్బందికి నిర్వహించిన మచిలీపట్నం డివిజన్ స్థాయి శిక్షణా తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో సాగు చేసే వ్యవసాయ భూములకు తప్ప, ప్రజలు నివాసముండే గ్రామ కంఠాలు లేదా ఆబాది భూములకు సర్వేలు నిర్వహించలేదని, అయితే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామ కంఠాలకు స్వమిత్వ(సర్వే ఆఫ్ విలేజ్ ఆబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) పేరుతో సర్వే నిర్వహించటం జరుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వమిత్వ సర్వే చేపడుతున్నామని, గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలకు సరిహద్దులు నిర్ణయించి, ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించడం స్వమిత్వ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

స్వమిత్వ సర్వే ద్వారా రెవిన్యూ సిబ్బంది తయారు చేసే రికార్డు శాశ్వతమైనదని, భవిష్యత్తు కాలంలో ఎలాంటి భూవివాదాలకు తావుండదని అన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా సర్వేను పూర్తి చేయాలని, అందుకు ఈ శిక్షణ తరగతుల ద్వారా సర్వే ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని సూచించారు. సర్వే పురోగతిపై వారంలో కనీసంగా రెండుసార్లు క్షేత్రస్థాయి సిబ్బందితో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని ఎంపీడీవోలకు కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా పంచాయతీ అధికారిణి జే అరుణ, ఎంపీడీవోలు, డి ఎల్ డి వో లు, డి ఎల్ పి ఓ లు, మండల సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *