Breaking News

నైలెట్ తిరుపతి ఎంపీ కృషి హైలెట్

-యువతకు నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉపాధి అవకాశాలు – ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (నైలెట్) తిరుపతి కేంద్రాన్ని అక్టోబర్ 2 న ప్రారంభించనున్న నేపథ్యంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం ఆ కేంద్రాన్ని సందర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నైలెట్ ఏర్పాటుకు ఎంపీ గురుమూర్తి నిరంతర కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ చేసిన ప్రయత్నాల ఫలితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నైలెట్ కేంద్రం ఏర్పాటు కానుంది.

నైలెట్ ద్వారా యువతకు విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ కోర్సులతో పాటు వెబ్ డిజైనింగ్, పీసీ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్, ఆఫీస్ ఆటోమేషన్, అకౌంటింగ్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ వంటి తక్కువ వ్యవధి కోర్సులు అందించనున్నారు. అలాగే తిరుపతి ప్రాంత యువతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎంబీడెడ్ సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫొరెన్సిక్స్, సెమికండక్టర్ డిజైన్, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

నైలెట్ ని సందర్శించిన ఎంపీకి నైలెట్ డైరెక్టర్ అధ్యాపక సిబ్బందిని పరిచయం చేసారు. అనంతరం ఆయన క్లాస్ రూమ్స్ ని, ల్యాబ్స్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు నిర్మాణంలో జాప్యం జరుగుతున్న విషయం గమనించి న ఎంపీ దాని గురించి ఆరా తీయగా మరుగుదొడ్ల ఇబ్బంది కారణంగా ఎక్కువ మంది విద్యారులను చేర్చుకొనేందుకు ఇబ్బందిగా ఉందని తెలియజేసారు. వెంటనే యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ తో మాట్లాడిన ఎంపీ సమస్య త్వరగా పరిష్కరించాలని కోరారు.

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ యువతకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ అవసరాలకు తగిన విదంగా వారి నైపుణ్యాన్ని పెంపొందించి, ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు పొందేలా నైలెట్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. స్థానికంగానే ఆధునిక సాంకేతిక శిక్షణ పొందే అవకాశాలు లభించడం వల్ల యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అందించనున్నారు.
నైలెట్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *