-గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవజీవన్ బాల భవన్ ఏన్ జివో ద్వారా రూ. 2 వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు పంపిణీ…
-బడి ఈడు పిల్లలందరినీ వెంటనే బడి లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలి…
-గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేసే ప్రభుత్వ పథకాలను వారికి అందించే విధంగా అధికారులు చర్యలు చేప్టటాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వీరంకి ప్రభునగర్ లో నివశిస్తున్న గిరిజన తెగలకు చెందిన యానాది కులస్తులకు ఆదార్, రేషన్ కార్డులతో పాటు కుల ధృవీకరణ పత్రాలను అందజేయాలని కలెక్టరు జె. నివాస్ తాహశీల్థారును ఆదేశించారు. తాడిగడప పురపాలక సంఘపరిధిలో గల వీరంకి ప్రభునగర్ లో నివశిస్తున్న యానాది కుటుంబాలను కలెక్టరు జె. నివాస్ అధికారులతో కలసి సందర్శించి వారి యోగ క్షేమాలను, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరంకి ప్రభునగర్ కాలనీలో నివశిస్తున్న 36 కుటుంబాలకు రేషన్, ఆదార్ కార్డులు మరియు కులధృవీకరణ పత్రాలు లేవని గుర్తించిన కలెక్టరు జె. నివాస్ వెంటనే వారందరికీ ఆదార్, రేషన్ కార్డులతో పాటు కులధృవీకరణ పత్రాలను కూడా అందజేయాలని పెనమలూరు తాహశీల్థారును కలెక్టరు ఆదేశించారు. బడి ఈడు గల వారి పిల్లలను వెంటనే బడి లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు జిల్లావిద్యా శాఖ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా పంచాయితీ లో పనిచేయుచున్న యానాదుల జీత భత్యాలను పరిశీలించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కలెక్టరు మున్సిపల్ కమీషనరును ఆదేశించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అందించే అన్ని పథకాలను వీరందరు సద్వినియోగం చేసుకునే విధంగాను మరియు వీరి పిల్లలలను పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ అధికారి త్వరిత గతిన చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. ఈ సందర్బంగా గిరిజన కుటుంబాలకు వర్షాన్ని నివురించేందుకు ఇంటి పై కప్పుపై కప్పుకునే టార్పాలియన్స్ గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేయగా కలెక్టరు పంపిణీ చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవజీవన్ బాలభవన్ వారి ద్వారా రూ. 2 వేల రూపాయలు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువును కలెక్టరు అధికారులతో కలసి పంపిణీ చేసారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి యం. రుక్మాంగదయ్య, తాడిగడప మున్సిపల్ కమీషనరు ప్రకాశరావు,పెనమలూరు తాహశీల్థారు బద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News