విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య శాఖలో తాత్కాలిక పద్ధతిలో వైద్యుల పోస్టులు భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒక సంవత్సర కాల పరిమితితో చిన్న పిల్లల వైద్య నిపుణులు 1, స్త్రీ వైద్య నిపుణులు 8, మత్తు ఇచ్చు వైద్య నిపుణులు 2 పోస్టులకు ఈనెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పైన తెలిపిన పోస్టులకు నెలకు రూ.1,10,000/-లు జీతం చెల్లించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎం.బి.బి.ఎస్. తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు సంబంధిత స్పెషలైజేషన్ లో డిప్లొమా కలిగి ఉండాలన్నారు. మరియు ఏ పి మెడికల్ కౌన్సిల్ లో తప్పనిసరిగా గుర్తింపు కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులతోపాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్స్ మరియు జిరాక్స్ ప్రతులు ఒక సెట్లతో డి.ఎం.హెచ్.ఓ కార్యాలయంనకు ‘వాక్ ఇన్ ఇంటర్వ్యూ’ నకు ఈనెల 20వ తేదీలోగా స్వయంగా హాజరు కావాలన్నారు. ఇతర వివరములకు www.krishna. nic. in వెబ్సైట్ పరిశీలించవలసిందిగా అని డా.సుహాసిని తెలిపారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …