Breaking News

బ్లాక్ ఫంగస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి… :  మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
కోవిద్ వైరస్ సోకి చికిత్స తీసుకుని కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని ముఖాముఖిగా వారితో సంభాషించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత మచిలీపట్నం మండలం గరాలదిబ్బ గ్రామానికి చెందిన ఒడుగు రత్న మాధురి తన భర్త రమేష్ కు ఆరోగ్యం బాగోలేదని ఇటీవల కరోనా వచ్చిందని ఇపుడు ఆయనకు బ్లాక్ ఫంగస్ సైతం సోకిందని వైద్యం నిమిత్తం ఖర్చు 8 లక్షల రూపాయల వరకు అవుతుందని తమ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమేనని ఏమైనా సహాయం చేయాలనీ మంత్రిని అభ్యర్ధించింది. ఈ విషయమై స్పందించిన ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మీకు ఆర్ధిక సహాయం అందేలాగున కృషి చేస్తానని అన్నారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, బ్లాక్ ఫంగస్ వ్యాధి అంటువ్యాధి కాదని ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని తెలిపారు, ఒడుగు రమేష్, రత్న మాధురి దంపతుల చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకున్నారు. కోవిడ్ చికిత్సలో మధుమేహ రోగులకు స్టెరాయిడ్స్ తరహా మందులు వాడడం వలన బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకే అవకాశం అధికంగా ఉందన్నారు. మొఖం వాచిపోవడo, తలనొప్పి, ముక్కు చుట్టు మచ్చలు రావడం, కన్ను ముక్కు వాపు రావడం, స్పర్శ తెలియకపోవడం, ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నేరుగా ఈ ఎన్ టి డాక్టర్ ను గాని క్రిటికల్ కేర్ డాక్టర్ ను కానీ సంప్రదించి వైద్యం పొందినట్లయితే ఈ వ్యాధి నుండి కోలు కోవచ్చుఅన్నారు, కోవిద్ బారినపడిన వారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే మందులు వాడాలని సూచించారు, మరియు డాక్టర్ పర్యవేక్షణతో మాత్రమే ఆక్సిజన్ వాడితే మంచిదని అన్నారు, బ్లాక్ ఫంగస్ ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. బంటుమిల్లి మండలం చెరుకుమిల్లి గ్రామానికి చెందిన పట్టపు శ్రీనివాసరావు మంత్రి వద్ద తన సమస్యను విన్నవించుకొన్నారు తన స్థలం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ ( ముడా ) పరిధిలో ఉందని ఇంటి నిర్మాణం కొరకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ విషయమై మంత్రి జవాబు ఇస్తూ ముడా పరిధిలో ఉన్న స్థలంలో ఆయా గ్రామ పంచాయతీ తీర్మానంతో 300 చదరపు గజాల స్థలం లోపు ఇళ్ల నిర్మాణం చేసుకునేవారికి ముడా నుంచి ఎటువంటి పర్మిషన్లు అవసరం లేదని మంత్రి పేర్ని నాని చెప్పారు. సీతారామపురం గ్రామానికి చెందిన మురారి గౌరీ శంకర్ మంత్రికి తన దుస్థితిని వివరించారు. నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న తనకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *