-టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, నన్నపనేని సదాశివరావు
-టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇరు తెలుగు రాష్ట్రాలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా అన్నారు. బుధవారం ఇతర బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, టి. జానకి దేవి, ఏ. రంగశ్రీ లతో కలిసి టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ…. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి కృప అందరికీ ఉండాలని ఆకాంక్షించారు.
నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ… అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. హైటెక్ సిటీ తరహాలో క్వాంటం వ్యాలీ అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రికి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News