తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు చిత్తూరు జిల్లా అధ్యక్షులు & ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వాహనాలను మోసే వాహన బేరర్లకు రూ.లక్ష రూపాయలను బ్రహ్మోత్సవ బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ…“గత 13 సంవత్సరాలనుండి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో వాహన బేరర్లకు లక్ష రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానంగా ఇస్తున్నాం. స్వామివారి సేవలో ఎల్లప్పుడూ నిబద్ధతతో పాల్గొంటున్న వాహన బేరర్లకు ఈ బహుమానం ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.
Prajavartha Online Telugu News