Breaking News

వజ్రా గ్రౌండ్స్ లో ఉన్న తాత్కాలిక బాణసంచా దుకాణాలను తనఖి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వజ్ర గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన తాత్కాలిక బాణసంచా దుకాణాలను డీజీ ఫైర్ సర్వీసెస్ పి.వి. రమణ ఆకస్మిక తనఖి నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన 16 బాణసంచా తాత్కాలిక దుకాణాలను అగ్ని ప్రమాదం జరగకుండా భద్రతా కారణాల దృశ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పై పూర్తి స్థాయిలో తనఖి నిర్వహించి, వారికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. బాణసంచా దుకాణదారులు ఏర్పాటు చేసుకున్న ఫైర్ ఎస్టింగుషర్ట్స్ ని ఎలా వాడాలి వంటి అంశాలపై వారిని అడిగి వారి చేత చేయించారు. అంతేకాకుండా అక్కడ వస్తున్న ప్రజలకు దీపావళి సందర్భంగా అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు చేయవలసిన పనులను కరపత్రాలు పంపిణీ చేసి వారికి అవగాహన కల్పించారు. భద్రత అవసరాల దృశ్య వజ్రా గ్రౌండ్లో ఈ 48 గంటల వ్యవధి వరకు ఉంచిన ఫైర్ ఇంజన్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ను పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు డి.జీ ఫైర్ సర్వీసెస్ పి. వి రమణ.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శంకర్, విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ వింగ్ డి ఎఫ్ ఓ మాలాద్రి, ఎస్ఎఫ్ఒ నరేష్, ఈస్ట్ ఎమ్మార్వో రోహిణి, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *