Breaking News

పురమిత్ర యాప్ ద్వారా మీ సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర హెచ్ యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్‌ ని అందుబాటులోకి తెచ్చిందని, నగర ప్రజలు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా ప్లే స్టోర్‌ లో డౌన్లోడ్‌ చేసుకొని, నగరపాలక సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చని, పురమిత్ర యాప్ ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ ధ్యానచంద్ర హెచ్ యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, పురమిత్ర యాప్‌ ద్వారా ప్రజలు మున్సిపల్‌ సేవలు, ఫిర్యాదులు, పన్ను చెల్లింపులు, జనన, మరణ, వివాహ ధృవీకరణ పత్రాలు వంటి దాదాపు 122 పురపాలక సేవలు పొందవచ్చన్నారు. సమస్యలను ఫిర్యాదుతో పాటు ఫొటోలను కూడా అప్‌ లోడ్‌ చేయవచ్చని తెలిపారు. వీది దీపాలు, చెత్త పేరుకుపోవడం, రెవెన్యూ, పట్టణ (ప్రణాళిక, ఇంజినీరింగ్‌ అంశాలపై ఫిర్యాదులు, సేవల కోసం దరఖాస్తు, వాటి పరిష్కార స్తితిని తెలుసుకోవానికి ట్రాకింగ్‌ కూడా ఉంటుందన్నారు. ఫిర్యాదులు, సేవల పరిష్కారానికి నిర్దేశిత గడువు ఉంటుందన్నారు. ఆస్తి పన్ను నీటి చార్జీలు, డి%ఇః%ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు, (డ్రైనేజి చార్జీలు, ఆస్తి పన్ను మ్యూటేషన్‌ ఫీజు, షాప్‌ లీజులు, అగ్రిమెంట్‌ ఫీజులు, అడ్వర్టైజ్మెంట్‌ ట్యాక్స్‌ లను యాప్‌ ద్వారా ఇంటి వద్ద నుండే చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే వారం నుండి వార్డ్‌ సచివాలయాల వారిగా ప్రజలకు యాప్‌ డౌన్లోడ్‌, వినియోగంపై అవగాహన కల్లిస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *