అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉన్న క్రమంలో రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్ని మాపక శాఖలు చేపట్టే సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పాలుపంచుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీలు, కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయిన పక్షంలో వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉన్న జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తన కార్యాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
Tags amaravathi
Check Also
కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …
Prajavartha Online Telugu News