-కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి…
-పూర్తి స్పష్టతతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బంధీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు.
స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ఓట్ల లెక్కింపు పై సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, స్పెషల్ ఆఫీసర్లు, రిటర్నింగ్ అధికారులు తదితరులతో కలెక్టర్ జె. నివాస్ సమావేశం నిర్వహించారు. అనంతరం వినీ హాలు నుంచి తహాశీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లకు, సిబ్బందికి స్పష్టతతో కూడిన శిక్షణ అందించాలన్నారు. శనివారం నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో వారికి కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ ఇవ్వడంతోపాటు వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. స్ట్రాంగ్రూమ్ నుండి బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ హాలుకు తీసుకురావడం దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తి చేసే వరకు ప్రతీ అంశంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలోని 4 డివిజన్ల పరిధిలో 17 కౌంటింగ్ కేంద్రాల్లో 648 ఎంపీటీసీ, 41 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించబడుతుందన్నారు. మండలానికి ఎన్ని ఎంపీటీసీ స్థానాలు వుంటే అన్ని టేబుల్స్ ని ఏర్పాటు చేయాలన్నారు. అన్ని లెక్కింపు కేంద్రాల్లో స్టేషనరీ, బాల్ పాయింట్ పెన్స్, పేపర్లు, రబ్బర్ బ్యాండ్స్ సిలింగ్ మీటిరియల్ లాంటి సామాగ్రి సిద్ధంగా వుంచుకోవాలన్నారు. ఏజెంట్ల ఐడి కార్డులను పరిశీలించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది ఇతర సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా భోజన తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ఉన్నా సిబ్బంది కన్న అదనంగా వీటిని ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాలు, భవనం వెలువుల అవసరమైన లైటింగ్ సదుపాయలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను క్షుణంగా చదివి సందేహాలు ముందే నివృత్తి చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ముందుగా చేపట్టే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై పూర్తి స్పష్టత కలిగి వుండాలన్నారు. అన్ని లెక్కింపు కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు తక్షణం పరిశీలించి అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపు గదుల్లో బారికేడింగ్ చేయడం బందోబస్తు తదితర ఏర్పాట్లు పరిశీలించలన్నారు. కౌంటింగ్ ఈనెల 19వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించాలన్నారు. సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 6 గంటలకే సిద్ధంగా వుండేలా చూసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి లెక్కింపు జరిగే కేంద్రం, సమయం తదితర వివరాలతో కూడిన సమాచారన్ని శుక్రవారం రాత్రికే సంబంధిత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అందజేసి వారి సంతకాలను తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల నియామకనికి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం అందించి శనివారం నాటికే జాబిత పొంది అరులైన వారికి పాస్ జారీ చేయాలన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారు సర్టిఫికెట్లు తీసుకురావాలని వ్యాక్సిన్ వేసుకోని వారు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ ద్వారా టెస్టు చేసుకున్నాక రిపోర్టు పరిశీలించి కేంద్రంలోకి అనుమతించాలన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి మాస్క్ తప్పనిసరిగా ధరిస్తేనే అనుమతించాలన్నారు. అన్ని చోట్ల మాలు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవిలత, కె. మోహన్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, నూజివీడు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి, జడ్పీసిఇఓ ఏఎస్ సూర్యప్రకాశరావు, డిపిఓ ఏడి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.