న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్-19 (కరొనా వైరస్) వ్యాధి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ భవన్ లో రెండవవిడత వ్యాక్సిన్ శిబిరం నిర్వహించిన ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పి.ఆర్.సి) భావ్నా సక్సేనా మరియు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్.సి) గౌరవ్ ఉప్పల్. ఏ.పీ భవన్ పి.ఆర్.సి మరియు టి.ఎస్ భవన్ ఆర్.సి ల సంయుక్త ఆధ్వర్యంలో, నేడు ఏ.పీ భవన్ లోని బీ.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో ఇరు భవన్ ల అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు మరియు తెలుగు మీడియా వారికి రెండవ విడత కోవిడ్-19 టీకా (కోవిషీల్డ్) పంపిణీ కార్యక్రమమును ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం 4 గం.ల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 143 మందికి టీకా వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ మనోహర్ లోహియా (ఆర్.ఎమ్.ఎల్) కమ్యూనిటి మెడిసిన్ వైద్యుడు డాక్టర్ అక్షిత్ శ్రీవాస్తవ, ఏ.పీ భవన్ వైద్యురాలు డాక్టర్ గ్రేస్ వైద్య సహకారం అందించారు.
Prajavartha Online Telugu News