Breaking News

కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు మూసివేత… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 19వ తేదీ ఆదివారం రాష్ట్రంలో ఎంపీటీసీ , జెడ్పిటిసి ఎన్నికల వోటింగ్ చేపట్టనున్న దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ననుసరించి 19 తేదీన జిల్లాలో మద్యం దుకాణాలు మూసి వేయాలని, మద్యం అమ్మకాలపై నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలనీ జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసారు. సెప్టెంబర్, 19వ తేదీలలో మద్యం దుకాణాలు మూసివేయడంతో, మద్యం అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవడం, మద్యం అక్రమ రవాణా జరగకుండా పక్క నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మద్యం నిల్వ చేయడం కూడా నేరమన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. సదరు అధికారి క్షేత్ర స్థాయిలోని అధికారుల సమన్వయంతో కౌంటింగ్ రోజున మద్యం అమ్మకాలు, నిల్వ, అక్రమ మద్యం అమ్మకాలపై నియంత్రణ పర్యవేక్షిస్తారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *