విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత 17 సంవత్సరాలుగా వైద్యరంగంలో పేరుగాంచిన విఘ్నేష్ హాస్పిటల్స్ వారి నూతన హాస్పిటల్ విఘ్నేష్ ఫెర్టిలిటీ & చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ను ఆదివారం ప్రజాశక్తినగర్, శిఖామణి సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజేయకల్లం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజేయకల్లం వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి విచ్చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో అందరికీ అందుబాటులో అన్ని వసతులతో ఈ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషదాయకరమన్నారు. మారుతున్న జీవనవిధానావలన, ఆహారపు అలవాట్లు వలన, లేట్ మ్యారేజేస్ వలన దంపతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్లందరికి ఫెర్టిలిటీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.మాతృత్వం ఒక వరమని పిల్లలులేని దంపతులకు ఈ హాస్పిటల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రసూతి, చిన్న పిల్లలకి అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవం ఉన్న డాక్టర్లతో చికిత్స కలదని పేర్కొన్నారు.
అనంతరం డైరెక్టర్ డా.వల్లి కొడాలి మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు గత 17 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో వైద్య సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఫెర్టిలిటీ, ప్రసూతి, చిన్న పిల్లలకు వైద్య సేవలను 24 గంటలు అందించనున్నామని తెలిపారు.ఫెర్టిలిటీ విభాగంలో ఐవిఎఫ్, ఐసిఎస్ఇ వంటి మొదలగు సదుపాయాలతో పాటు 100 పడకలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. గర్భవతుల కోసం ప్రత్యేకంగా అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలతో ప్రత్యేక ప్రసూతి విభాగం కలదని అలాగే శిశువుల కోసం 24 పడకల ఎస్ఎసియు, 20 పడకల పిఐసియులు ఏర్పాటు, పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఒబెసిటీ క్లినిక్ ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బొప్పన భవ కుమార్, డా. విజయలక్ష్మి తెళ్ళ, డా.కరుణ వెల్లంకి, డా.ఉమాదేవి కావలి, డా.శ్రీముఖి అనుమోలు, డా.రవీంద్రబాబు పరుచూరి హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు.