విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధముగా సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, అభివృద్ధి పనులు గాని చేపట్టడం జరిగిందని, ఆ విషయం ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టి వారికి నిజాలను చెప్పే బాధ్యత వైస్సార్సీపీ నాయకులదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన వైస్సార్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ రాబోయే రోజుల్లో పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలను, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ను వారికి వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయనివిధంగా కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని, టీడీపీ ప్రభుత్వం లో సంక్షేమ పథకాలు అన్ని వారి పార్టీ వారికే ఇచ్చేవారని, ఎవరికైనా ఏదైనా పని కావాలి అన్న, అవ్వతాతలు పెన్షన్ తీసుకోవడానికి కార్యాలయల చుట్టూ కాల్లరిగేలా తిరిగి, స్థానిక నాయకులకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇంటి వద్దకే అన్ని వస్తున్నాయి అని ఈ విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి మరలా మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేయాలని తెలిపారు. ప్రతిపక్షాలు వారి రాజకీయ మనుగడ కోసం పెన్షన్లు తొలగిస్తున్నారని,కరెంట్ చార్జీలు పెంచారని,సంక్షేమ పథకాలు తొలగిస్తున్నారని అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను బయన్దోళనలు గురి చేస్తున్నారని, కాబట్టి నేడు ప్రజలకు అండగా మనమందరం ప్రజలలోకి వెళ్లి వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, ఏ నమ్మకం తో అయితే కార్పొరేషన్ ప్రజలు మనల్ని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాబోయే 30 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి ఉండటం అవసరమని అందుకు అందరం కలిసికట్టుగా పని చేయాలని,ప్రతి కార్యకర్తకు అండగా నిలబడాల్సిన అవసరం ప్రతి నాయకుడు మీద ఉందని,కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, ఇక నుండి కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ ఛార్జ్ లు ప్రతి నెల కార్యకర్తల సమావేశాలు పెట్టి వారి సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని, అదేవిధంగా ప్రతి నెల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. గత రెండు రోజులు గా తెలుగుదేశం నాయకులు వైసీపీ ప్రభుత్వం మీద,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, మంత్రుల మీద చిల్లర వ్యాఖ్యలు చేస్తూ, బూతులతో రెచ్చకొట్టి వారి రాజకీయ పబ్బం గడుపుకోవలని చూడటం సిగ్గుచేటు అని, మరొక్కమారు ఇదే పునరావృతం అయితే మాత్రం వైస్సార్సీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అంతకు రెట్టింపు బదులు చెబుతారని గట్టిగా హెచ్చరించారు. ఇక్కడి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ షో రాజకీయాలు, డ్రామాలతో ఇన్నిరోజులు ప్రజలను మభ్యపెట్టరాని,ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు అర్థం అయ్యి మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి గట్టి బుద్ధి చెప్పారని, రాబోయే శాసనసభ ఎన్నికల్లో తూర్పు గడ్డ మీద వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఉద్ఘటించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దళితుల మీద ఎంత ప్రేమ ఉందొ మీ పాలన లో ప్రజలు చూశారని అందుకే మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేసారని గుర్తు పెట్టుకోవాలని,మొదటిసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాడనికి మీరు భయపడేలా చేశామని, మీరెన్ని కుట్ర రాజకీయాలు చేసిన పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ని, ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం పని చేద్దామని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైయస్సార్ పార్టీ విజయకేతనం…
స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని టిడిపి పార్టీ నాయకులు కుట్రలు చేసి కోర్టు కి వెళ్లి గత ఏడాది కాలంగా ఎన్నికలు జరగకుండా, ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపు జరగకుండా మరోసారి కోర్టుకు వెళ్లి కుట్రలు పన్నడం జరిగింది. వారి కుట్రలను పటాపంచలు చేస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు నాయుడు గారికి చెంపపెట్టులా గా ఉందని వారి మోసాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోవు ఎన్నికలలో కూడా వైయస్సార్ పార్టీ విజయకేతనం ఎగర వేస్తుందని దానికి స్థానిక సంస్థల ఎన్నికల నిదర్శనమని అని అన్నారు. ఈ సమావేశం లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, సీనియర్ నాయకులు కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు,కార్పొరేటర్లు, ఇన్ ఛార్జీలు,స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.