-అందుబాటులో కోవిషీల్డ్, కోవాక్సిన్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని మూడు నియోజకవర్గాలలో పరిధిలోని 286 సచివాలయాలలో రేపు అనగా 20.09.2021 సోమవారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. 31000 కోవిషీల్డ్ / కొవాక్సిన్ మొదటి మరియు రెండోవ డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ అన్ని వార్డ్ సచివాలయాలు మొదటి / రెండోవ డోస్ గా కోవిషిల్డ్ / కొవాక్షిన్ అందిస్తున్నట్లు ఆందరూ సద్వినియోగ పరచుకోవాలన్నారు.