నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ లో విష జ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో విష జ్వరాలు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా పంచాయతీ అధికారులు, పురపాలక సంఘ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ , మలేరియా, టైఫాయిడ్ వంటివి దోమల కారణంగా వ్యాపిస్తాయని, దోమలు నిర్మూలనకు ప్రతీ రోజూ మలాథియాన్ వంటివి ఫాగ్గింగ్ చేయడంతోపాటు, డ్రైనేజీలలో దోమల నిర్ములనకు ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు. డ్రైనేజీలో ఎప్పటికప్పడు పూడిక తీయించి, మురుగు నీరు నిల్వ లేకండా చూడాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసేందుకు ప్రతీ శుక్రవారం ‘డ్రై డే ‘ గా పాటించడంపై పై గ్రామాలలోను, పట్టణ ప్రాంతాలలోనూ ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హోటల్స్ పరిసరాలలో అపారిశుధ్య పరిస్థితులు లేకుండా చూడాలని, హోటల్స్, వీధి వ్యాపారుల వద్ద తినుబండారాలు కలుషితం కాకుండా చూడాలన్నారు. జ్వరాలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని వైద్య శాఖాధికారులను ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశించారు.
Tags nuzividu
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …