Breaking News

కార్తీక మాసం, భవానీ దీక్షల కార్యాచరణ గురించి సమావేశం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
మహా మంటపం 4వ అంతస్తు ఈవో ఛాంబర్లో ఈరోజు మధ్యాహ్నం కార్తీక మాసం, భవానీ దీక్షల కార్యాచరణ గురించి సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్ సమావేశం నిర్వహించి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 05 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్బంగానిర్వహించే దీపోత్సవంలో వైదిక కార్యక్రమముల నిర్వహణ, భక్తుల భద్రత రీత్యా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సిబ్బంది తో చర్చించారు. భక్తుల భద్రత గురించి తాజాగా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు అమలు పై వైదిక కమిటీ వారితో మాట్లాడారు.
ఈనెల 05 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్బంగానిర్వహించే దీపోత్సవం కార్యక్రమం పూర్తి స్థాయిలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించాలని, దేవస్థానం వైదికసిబ్బంది ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి శ్రీ దుర్గామల్లేశ్వరులకు దేవాలయ సాంప్రదాయం ప్రకారం వైదిక క్రతువులు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇటీవల పరిస్థితుల అనుసరించి దేవాలయ అంతర్గత కార్యక్రమంగా దీపోత్సవం నిర్వహిస్తూ, పౌర్ణమి సాయంత్రం దీపాలు దేవాలయ అర్చకులు వెలిగిస్తారని,భక్తుల భద్రత రీత్యా భక్తులకు ఈ కార్యక్రమం లో పాల్గొనే అవకాశం లేదని తెలిపారు. ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కడ దీపాలు ఏర్పాటు చేయాలి, రాక పోకల దారులు ఏర్పాటు,తగు భద్రతా ఏర్పాటు గురించి నగర పోలీస్ అధికారులు తగు సూచనలు చేశారు. డిసెంబర్ 04 న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు, భవాని దీక్షల విరమణ గురించి చర్చించారు.
ఈ కార్యక్రమం నగర ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, ఏసీపీ దుర్గారావు, వన్ టౌన్ సిఐ గురు ప్రకాష్, ట్రాఫిక్ సిఐ ఉమా మహేశ్వరరావు, స్థానా చార్య శివ ప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు షణ్ముఖ శాస్త్రి, వి. ఎస్. మహర్షి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రాంబాబు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చంద్రశేఖర్, సుధారాణి, రమేష్ బాబు, వెంకట్ రెడ్డి,శ్రీ గంగాధర్, శ్రీనివాస్, తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

‘భవాని దీక్షల కరపత్రం, వాల్ పోస్టర్ ఆవిష్కరణ’
సమావేశం అనంతరం భవాని దీక్షలు 2025 కు సంబంధించిన కర పత్రం, వాల్ పోస్టర్ ధర్మ కర్తల మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ తదితరులు ఆవిష్కరణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *