-కడపను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం…
-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా….
-కడప నగరంలోని స్థానిక 28వ డివిజన్ లో రూ.28 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రణాళిక బద్దంగా కడపను అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 28వ డివిజన్ లోని సయ్యద్ సాహెబ్ వీధి పరిధిలో… నగర మేయర్ కె.సురేష్ బాబుతో కలిసి.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా.. 14 వ ఆర్థిక సంఘం రూ.28 లక్షల నిధులతో చేపడుతున్న నూతన సీసీ డ్రైన్స్, సీసీ రోడ్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన అనంతరం.. కడప జిల్లా అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లాను పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. మళ్ళీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుండీ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకోపోతుందన్నారు. కడప జిల్లాను, కడప నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కడప నగరాభివృద్ది లో భాగంగా అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేసి.. కడప నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి పేద బడుగు, బలహీన మైనార్టీ వర్గాల గురించి ఆలోచించి అనేక సంక్షేమ పథకాలను నవరత్నాల రూపంలో ప్రజల చెంతకు తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న అనేక మంది నిరుద్యోగ యువత కోసం గ్రామ, వార్డు సచివాలయ , వాలెంటరీ వ్యవస్థలను తీసుకొచ్చి ఒక్క పేదవాడు కూడా సంక్షేమ పథకాల కోసం ఏ ప్రభుత్వం ఆఫీస్ చుట్టూ తిరగకుండా వారి ప్రాంతాల్లోనే గ్రామ,వార్డు సచివాలయం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కు ఆదర్శనంగా నిలిచారన్నారు. కడప నగర ప్రగతిలో భాగంగా ప్రజారోగ్యానికి పెద్దపీఠ వేస్తూ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు రిమ్స్ ప్రాంగణాన్ని ఒక మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు, నేత్ర వైద్యశాల, కేన్సర్ పరిశోధనా వైద్యశాల, మానసిక వైద్యశాలల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శంఖు స్థాపన చేశారన్నారు.అలాగే 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రూ.60 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కడప నగరంలో 16 రహదారులను విస్తరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మొదటిదశలో 7 ప్రాధాన్యత ఉన్న రోడ్లను రూ.280 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు.అందులో ఇప్పటికే రెండు రోడ్లు ఎర్రముక్కపల్లి-రిమ్స్ రోడ్డు,రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తి చేశామన్నారు.నగర ప్రజలు కుటుంబాలతో ఆహ్లాదకరంగా గడపడానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో దేవుని కడప చెరువును పిక్నిక్ స్పాట్ గా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. నగరంలో వర్షపు నీటి సమస్య పరిస్కారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వెంటినే స్పందించి రూ 78 కోట్ల తో స్ట్రోమ్ డ్రైన్స్ ఏర్పాటుకు మంజూరు చేశారన్నారు. ఇందు కోసం టెండర్లు పిలిచి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.కడప నగారాభివృద్ధిలో ప్రజలు బాగాస్వాములయ్యి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ….
కడప నగరానికి చారిత్రక నేపథ్యం ఉందని, కడప జిల్లా ఏర్పడి 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో కడప అభివృద్ధికి నోచుకోలేదని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో రిమ్స్, యోగి వేమన విశ్వవిద్యాలయం,రోడ్లు విస్తరణ లాంటి అభివృద్ధి పనులు జరిగాయన్నారు.మళ్లీ ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పూర్తిస్థాయిలో కడప నగర అభివృద్ధికి చేసేందుకు రూ.870 కోట్లతో ప్రణాళిక రూపొందించామన్నారు.అందులో భాగంగా విద్య, వైద్య,ఆరోగ్యానికి పెద్ద బాట వేస్తూ రిమ్స్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే కడప నగరంలో రూ. 85 కోట్లతో సోలార్ ప్లాంట్ కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాబోవు కాలంలో కడప నగరాన్ని మరింత అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో 28 వ డివిజన్ కార్పొరేటర్ హారిఫుల్ల,నగర కార్పొరేటర్లు షఫీ, గౌస్,అక్బర్,కమాల్ బాష ,సూర్యనారాయణ,మాజీ కౌన్సిలర్ గౌస్ పీర్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుబ్బమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు ముసాసేట్,ఫయాజ్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.