Breaking News

విద్యతోపాటు క్రీడారంగంలో కూడా ప్రావీణ్యం సంపాదించాలి…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ తైకాండో సమైక్య వారి ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ బి.వి. రమణయ్య నిర్వహించిన బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామినేషన్ లో ఒంగోలు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ప్రతిభ కనబరిచి బ్లాక్ బెల్స్ తో పాటు మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్స్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు చేతులు మీదుగా పిల్లలకి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడారంగంలో కూడా ప్రావీణ్యం సంపాదించాలని అప్పుడే విద్యార్థులు ఎదుకుదలకు ద్రోహదపడుతుందని దీంతోపాటు క్రీడారంగంలో ఉన్నత స్థానాలు అధిరోహించి దేశ ప్రతిష్టను చాటటానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడారంగంలో ఆసక్తి కనపరచాలని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమంలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి కుంటి రాజేశ్వరి చేతులు మీదుగా విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఐడి కార్డ్స్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ థైకాండో కోచ్ ఫిఫ్త్ డాన్ ఛాంపియన్ షేక్ కరీముల్లా, బి జే ఎం సి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పఠాన్ సాజిద్ ఖాన్, ఆదిల్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా విద్యార్థులను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *