Breaking News

రైతుల ధాన్యం కొనుగోలు చేస్తాం

-అన్ని విధాల ఆదుకుంటాం
-సివిల్ సప్లై ఎండి ఢిల్లీ రావు రైతు నేతలకు హామీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, పంట నష్టపరిహారం కూడా చెల్లిస్తామని ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి ఢిల్లీ రావు రైతు సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. బుధవారం బందర్ రోడ్ లోని కానూరు పరిధిలో ఉన్న ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఎండి ఢిల్లీ రావుని, మాజీ మంత్రి, ఏపీ ఎస్ కెయం కన్వీనర్ వడ్డే శోభనాటేశ్వరరావు, ఏపీ రైతు సంఘాల రాష్ట్ర నేతలు కెవివి ప్రసాద్, వై కేశవరావు, పి జమలయ్య, ఎం హరిబాబు, యం. యలమందరావు, యు.వీరబాబు, యం.ప్రసాద్ బాబు, కె.శ్రీనివాస రావు కలిసి డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఎండి పలు డిమాండ్లపై హామీ ఇచ్చారు. రైతులకు ఏ కష్టం రాకుండా చూస్తామని, సమస్యలు నెరవేరుస్తామని తెలిపారు. ధ్యానం తేమ శాతం 17% శాతం అధికంగా ఉన్నా కూడా కొనుగోలు చేస్తామన్నారు. భారీ తుఫానుకు పంట నష్ట పరిహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను రైతులకు నేరుగా తమ బ్యాంక్ ఖాతాల ద్వారా అందజేస్తామన్నారు. రైతులకు గోని సంచులు, రవాణా చార్జీలు కూడా మద్దతు ధరకు అదనంగా అందజేయాలని కోరగా అందుకు హామీ ఇచ్చారు. మిల్లర్ల యజమాన్యం నుంచి వచ్చే వేధింపులు కూడా ఆపాలని కోరగా, అలాంటి సంఘటనలు జరిగితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సేవ కేంద్రాల్లో ఎటువంటి అవకతవకలు జరిగిన ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. పంట నష్ట పరిహారం అంచనాలో కానీ, మిగిలిన ధాన్యం కొనుగోలులో కానీ, తేమశాతం అంచనాలో కానీ ఎటువంటి సమస్యలు రైతులు ఎదురైనా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని రైతు సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఏటువంటి గందరగోళ పడకుండా రైతులు నేరుగా రైతు సేవా కేంద్రాల్లో తమ ధాన్యాన్ని అందజేయొవచ్చని, తేమ శాతాన్ని అంచనా వేయించుకోవచ్చు అని, పంట నష్టపరిహారం నమోదు చేసుకోవచ్చని, పంట ఈ క్రాప్ నమోదు ప్రకారం పంట పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతు సంఘాల ప్రతినిధులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. రైతులు ఎదుర్కొనే ఇతర సమస్యలు ఏమైనాప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *