Breaking News

ప్రత్యేక రైల్లో శబరిమల – అరుణాచలం యాత్ర

-శబరిమల యాత్ర – అయ్యప్ప స్వామి మరియు అరుణాచలేశ్వరుని దర్శనం
-తేదీ: 10 డిసెంబర్ 2025

హైదరాబాద్,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక రైల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్ర రైలు యాత్ర ఈ డిసెంబర్ లో ప్రారంభం కానుంది అని సౌత్ స్టార్ రైల్ ప్రోడక్ట్ డైరెక్టర్ శ్రీ విగ్నేష్ ప్రకటించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రత్యేక రైలు లో అయ్యప్ప స్వామి మరియు అరుణాచలేశ్వరుని దర్శించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఈ యాత్ర డిసెంబర్ 10న ప్రారంభం కానుంది. ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ రైలు – సౌత్ స్టార్ రైల్ – టూరిజం మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ఆపరేటర్, మరియు దేశంలో అత్యుత్తమ రైలు టూరిజం ఆపరేటర్ అయినటువంటి టూర్ టైమ్స్ వారు ఈ యాత్ర ను నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక పర్యాటక రైలు, సాధారణ రైలుల IRCTC వెబ్సైట్లో బుకింగ్ కోసం అందుబాటులో లేదు. రిజర్వేషన్లకు టూర్ టైమ్స్ను నేరుగా 93550 21516 నంబర్లో సంప్రదించడం ద్వారా లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి www.tourtimes.in సందర్శించడం ద్వారా మాత్రమే చేయవచన్నారు.
ఈ యాత్రలో అయ్యప్ప స్వామి మరియు అరుణాచలం వంటి ప్రసిద్ధ దేవాలయాలను దర్శించవచ్చు. ఈ ఐదు రోజుల యాత్రకు 2SLకు ₹8,500; 3ACకు ₹10,500; 2ACకు ₹12,500; 1ACకు ₹13,500 అని తెలిపారు.
ఇండియన్ రైల్వేస్ – భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైలును టూర్ టైమ్స్ నడుపుతుంది. ఇప్పటి వరకు ఈ పర్యాటక రైలు 2,61,185 రైలు కిలోమీటర్లు ప్రయాణించి 22,100 మంది ప్రయాణికులను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ గమ్యస్థానాలను సందర్శింపజేసింది. ఈ ప్యాకేజీలో భారతీయ రైల్వేలు 33% సబ్సిడీ కలిగి ఉంది. ఈ ప్రత్యేక పర్యాటక రైలు హైదరాబాద్ నుండి బైయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ నుండి పర్యాటకులు రైలు ఎక్కడానికి వీలు కల్పిస్తున్నారు.

ఈ రైలు ప్రత్యేకతలు:
• పబ్లిక్ అనౌన్స్మెంట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్,
• ఆన్బోర్డ్ టూర్ మేనేజర్లు,
• కోచ్ సెక్యూరిటీ,
• ఆన్-బోర్డ్ మరియు దక్షిణ భారత veg భోజనం అందించబడుతుంది.
• ఈ ప్రత్యేక రైలులో 1X1AC, 3X2AC, 5X3AC, 2X2SL, 1XPantry కార్ ఉంటాయి.
• ఈ పర్యాటక రైలు మొత్తం 650 ప్రయాణికులు సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ ప్యాకేజీ ప్రత్యేకతలు:
• నిలక్కల్ నుండి స్టేషన్ వరకు బస్సు,
• ట్రావెల్ ఇన్సూరెన్స్,
• రైలు భోజనం
• యాత్రికులు LTC/LFC సౌకర్యాన్ని కూడా పొందవచ్చు అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *