పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతిష్టత్మకం గా అమలు చేసిన పేదలందరికి ఇళ్లు పధకం క్రింద గృహ నిర్మాణ కార్యక్రమం వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. గురువారం పెనుగొండ మండలం లో రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల లే అవుట్ ను అంబేద్కర్,జె. సి ఆసరా, కొవ్వూరు ఇంచార్జ్ ఆర్డీఓ, పి.పద్మావతి పరి శీలించారు. ఈ సందర్బంగా అంబే ద్కర్ మాట్లాడు తూ సెప్టెంబర్ నెలా ఖరు నాటికి 30 వేల గృహాలు బేస్మెంట్ లెవెల్ కు తీసుకురావాలని లక్యంగా నిర్ణయిం చడం జరిగింద న్నారు. లబ్ధిదారు లకు ఇసుక , సిమెంట్,ఐరన్ కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశిం చారు . సచివాలయం వారీ గా టార్గెట్లు నిర్ణయించి ఆ విధంగా గృహనిర్మాణాలు బేస్మెంట్ వరకు తీసుకు వచ్చే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు.శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల తో సమన్వయం చేసుకుని గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. లబ్దిదారు లకు అధికారులు సహాయాన్ని అం దిస్తూ లబ్ది దారులు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టే విధంగా చర్యలు తీ సుకోవాలి అన్నారు. మండలం లో 2466 మంది లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునేందుకు మంజూరు కాగా, ఇప్పటి వరకు 102 మంది లబ్ధిదా రులు ఇళ్ల నిర్మాణం మొదులు పెట్ట డం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తశీల్దా ర్, వై.రవి కుమార్, యం.డి. ఓ, కె.పురుషోత్తమ రావు, హౌసింగ్ ఏ. ఈ, పి. సూర్యా రావు తదితరులు పాల్గొన్నారు.
Tags penugonda
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …