-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భూమి పైన హక్కులు ఉంటేనే పేదలకు ఆత్మ గౌరవం ఉంటుందని,సంపద లో భాగస్వామ్యులను చేయాలని అపుడే సామాజిక న్యాయం జరుగుతుందని,ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ సంపద సృష్టించే వర్గాలు దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు నేటికి అట్టడుగు స్థాయి లో వున్నారని, సంపద ఆవర్గాలకు అందకుండా ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. సంపద సృష్టించే వాడికి అనుభవించే హక్కు లేదా?అని ప్రశ్నించారు.సంపద పంచే వరకు మన పోరాటాలు చేయాలే తప్ప,ప్రభుత్వాలను అడుక్కోవద్దన్నారు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పేదలకు పంచడం లేదని, కార్పొరేట్ల కు, పారశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు.రాజ్యాంగం కల్పించిన విద్య, వైద్యం, ఆరోగ్యం, భూమి,ఇల్లు లాంటివి పేదవాడికి అందని ద్రాక్ష అన్నారు.రాష్ట్రము లో దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు కనపడుతున్నదని,ఇప్పటికి దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నదన్నారు. రాజకీయాల్లో కింది వర్గాలకు ప్రాతినిత్యం కల్పిస్తున్నా వారితో సమానంగా చూడటం లేదన్నారు.భూపోరాటాలు ఉదృతం చేసి పేదలకు భూములు దక్కేలా చూడాలన్నారు. సమాజం లో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, మాజీ యమ్ యల్ సి జల్లి విల్సన్ మాట్లాడుతూ కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను ప్రభుత్వం అమలు చేసి గ్రామీణ కష్ట జీవులకు ఇళ్ల స్థలాలు సాగుభూములు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులు మొదలు పెట్టాలని,ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వలసలు ప్రారంభం అయ్యాయని, డ్వామా అధికారులు వలసలు నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వాలు పని ప్రదేశాలకు వెళ్లి ఉపాది పనులు మొదలు పెట్టేలా చూడాలని శ్రేణులను కోరారు. ఈ నెల 18 న సామజిక న్యాయం, ఆత్మ గౌరవం కల్పించాలని సిపిఐ తలపెట్టిన దేశ వ్యాప్త ఆందోళన లో పాల్గొనాలన్నారు. ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27 వ తేదీ సీసీయల్ఏ ఆఫీస్ ముందు అసైన్డ్ భూముల భూభదలాయింపు నిషేధిత చట్ట సవరణ ను విరామించుకోవాలని కోరుతూ ధర్నా ను జయప్రదం చేయాలన్నారు.సమావేశం లో ఇటీవల మరణించిన సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి,భూపోరాట యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి, తెలంగాణ ప్రముఖ రచయిత అందె శ్రీ, వ్యవసాయ కార్మిక సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు అలబోయిన అప్పలనాయుడు,అనకాపల్లి జిల్లా కార్యదర్శి యమ్ రామానాయుడు, అనుమన్న, మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. సమావేశం లో ఈ క్రింది నిర్ణయాలు చేయడం జరిగింది. గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి సంఘ సభ్యత్వం చేర్పించి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు.భూసమస్యలు పై ఇళ్ల స్థలాలు, సాగుభూములు కోసం భూ పోరాటాలు నిర్వహించాలని, ప్రభుత్వం తో పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని ఖాళీగా ఉంటే పేదలకు పంచాలని, సిపిఐ శతజయంతోత్సవాల సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో కర్నూలు లో ఉపాధి హామీ పై,ఏలూరు లో భూసమస్యలపై, రాష్ట్ర సదస్సు లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఆర్ వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు,బండి వెంకటేశ్వరరావు బి కే యం యు జాతీయ కార్యవర్గ సభ్యులు బి కేశవరెడ్డి, సి సుబ్రహ్మణ్యం, చిలకూరి వెంకటేశ్వరరావు, కాబోతు ఈశ్వరరావు, ఆర్ విజయ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై ఎల్ రామాంజనేయులు, కలిశేట్టి వెంకట్రావు,టీ రంగయ్య, ఎం నబి రసూల్, కే రాధాకృష్ణ, తులసి రాజన్, కదిరప్ప, అనురాధ, లక్ష్మి, శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News