అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ జె.ఉమాదేవి న్యాయ వ్యవస్థకు అందించిన సేవలు అభినందనీయమైనవని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి పేర్కొన్నారు.హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ జె..ఉమాదేవి ఈనెల 25వ తేదీన పదవీ విరమణ చేయనుండగా శనివారం సెలవు దినం కావడంతో ఒక రోజుముందుగా ఆమెకు శుక్రవారం హైకోర్టులోని ప్రధాన న్యాయమూర్తి వారి కోర్టు హోల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు సభ జరిగింది.ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఉమా దేవి అందించిన సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.జస్టిస్ ఉమాదేవి జీవిత విశేషాలకు సంబంధించిన కొన్నిముఖ్య అంశాలను గురించి ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు చెందిన జస్టిస్ ఉమాదేవి 1986లో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుండి న్యాయవాద పట్టా పొందారని చెప్పారు.అలాగే 1996లో అన్నామలై విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారని తెలిపారు.1996లో జిల్లా న్యాయమూర్తిగా నేరుగా నియామకం పొందారని,అలాగే 2017లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియామకం పొందారని అన్నారు.సుమారు రెండున్నర దశాబ్దాలకు పైగా జస్టిస్ ఉమాదేవి న్యాయవ్యవస్థకు అందించిన సేవలు అన్ని విధాలా అభినందనీయమైని కొనియాడుతూ ఆమె విశ్రాంత జీవితం కూడా ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా కొనసాగాలని చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆకాంక్షించారు.
హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఉమాదేవి మాట్లాడుతూ తాను రెండున్నర దశాబ్దాలకు పైగా జుడీషియల్ అధికారిగా సేవలందించుటలో సహకరించిన సహచరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఇంతటి స్థాయికు చేరానంటే అందుకు నాకుటుంబ సభ్యులు అందించిన తోడ్పాటేనని ఆమె పేర్కొన్నారు.ముఖ్యంగా నాతల్లి దండ్రులు విద్యావంతులు కాకపోయినప్పటికీ వారు నేర్పిన నైతిక విలువలను పాటిస్తూ నాకెరీర్ లో నేను ఇంతటి స్థాయికి చేరుకున్నానని అన్నారు.హైకోర్టు న్యాయమూర్తిగా తన కేరీర్లో డివిజన్ బెంచ్ లో సీనియర్ న్యాయమూర్తులతో కలిసి పనిచేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.న్యాయమూర్తిగా పలు క్రిమినల్,సివిల్ కేసుల తోపాటు టాక్సేషన్,ఆర్బిట్రేషన్,మాట్రిమోనియల్,వాణిజ్య పన్నులకు సంబంధించిన కేసులను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు.అదే విధంగా నాసహచర న్యాయమూర్తులు, తదితరులు అందరూ తనకు అందించిన తోడ్పాకు జస్టిస్ ఉమాదేవి ప్రత్యేకంగా కృతజ్ణతలు తెలిపారు.
అంతకు ముందు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్,హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వైవి రవి ప్రసాద్,చైర్మన్ బార్ కౌన్సిల్ గంటా రామారావు,సహాయ సౌలిసిటర్ జనరల్ ఎన్.హరినాధ్ మాట్లాడుతూ న్యాయమూర్తిగా జస్టిస్ ఉమాదేవి అందించిన సేవలను కొనియాడుతూ ఆమె శేష జీవితమంతా ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈవీడ్కోలు సమావేశంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి చెందిన పలువురు న్యాయమూర్తులు,రిజిష్ట్రాలు,బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు
-రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు -రూ.1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం -వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి …