Breaking News

మహిళల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మహిళా సాదరికత కు పెద్ద పీట వేస్తూ ప్రతి పధకంలో,పదవులలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజిన్, భ్రమరాంబాపురం నందు మహిళాభివృద్ధి,శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మహోత్సవానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలసి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం గా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి అని తద్వారా సమాజం బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారు మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం పై మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారిలో చైతన్యం కలిగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమలు చేపట్టడమే కాకుండా, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం గా ఉండేలా పౌష్టికాహారం అందజేయడం మంచి పరిణామం అంటూ కొనియాడారు. బిడ్డ పుట్టిన తరువాత వారికి బాలామృతం గాని,వారు చదువుకోడానికి అమ్మఒడి,నాడు నేడు ద్వారా స్కూలులు,హాస్పిటల్ లు ఆధునీకరణ ఇలా పుట్టిన దగ్గర నుండి జీవితంలో స్థిర పడేవారకు వారికి అండగా నిలిచేలా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వం నిదే అని ఉద్ఘటించారు. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం, వైద్య సేవలు ఉపయోగించుకొని మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. తదనంతరం సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది హరిత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *