విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజాసమస్యల పరిష్కారంలో మంచి సత్ఫలితాలనిచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ ఇసరపు దేవి రాజారమేష్ తో కలిసి న్యూ ఆర్.ఆర్.పేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలపై సంక్షేమ క్యాలెండర్ కరపత్రాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ఏయే నెలలలో, ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను క్లుప్తంగా తెలియజేయడం, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సిబ్బంది ఫోన్ నెంబర్లను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావు లేకుండా శాచ్యురేషన్ పద్ధతిలో 543 సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. సచివాలయ వ్యవస్థ పనితీరుని దేశ ప్రధాని నరేంద్రమోదీ సైతం అభినందించారని.. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని మెచ్చుకున్నట్లు తెలిపారు.జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థకు అవార్డులు రావడం వెనుక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఎంతగానో ఉందన్నారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలో 30వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు కాగా.. తొలిదశలో 15వేల ఇళ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. మార్చి 31 కల్లా ఆయా నిర్మాణాలను పూర్తిచేసి పేదలకు అందజేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా డివిజన్ లో 3,198 మందికి అమ్మఒడి, 1,614 మందికి రూ. 2,250 చొప్పున పింఛన్, 2వేల మంది ఇళ్ల పట్టాలు అందించినట్లు వెల్లడించారు. కావున సచివాలయ సిబ్బంది బాధ్యతతో ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో ప్రతి ఇంటికి సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు తప్పనిసరిగా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆదినారాయణ, చెన్నకేశవరెడ్డి, నూతలపాటి శ్రీనివాసరావు, గోవింద్, చెన్నారెడ్డి, దుర్గాప్రసాద్, శ్రీనివాసరెడ్డి, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News