Breaking News

మైనింగ్ రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

– గత ఐదేళ్లు మైనింగ్ రంగాన్ని నాశనం చేశారు
– క్రిటికల్ మినరల్స్ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం
– విశాఖ కేంద్రంగా ఒక్క రోజులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం
– ప్రకాశం జిల్లా మైనింగ్ కార్యాలయ భావన నిర్మానానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
మైనింగ్ రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సాయ శక్తుల కృషి చేస్తానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒంగోలులో ప్రకాశం జిల్లా మైనింగ్ కార్యాలయం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేసే దశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుమారు 20 సెంట్ల స్థలంలో రూ.2.14 కోట్ల వ్యవంతో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు.

గత ఐదేళ్లు రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. బెదిరించి భయపెట్టి నిట్ట నిలువునా దోచుకున్నాడు. క్వారీ యజమానులను, ఫ్యాక్టరీ యజమానులను బెదిరించి కప్పం కట్టించుకున్నాడు. ఫలితంగా రాష్ట్రంలో మైనింగ్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. కూటమి అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నాం. ఇప్పటికే ఉచిత ఇసుకతో పేదలకు అండగా నిలిచాము. బీచ్ శాండ్ సహా క్రిటికల్ మినరల్స్ విషయంలో ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్నాం. రాష్ట్ర మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శవంతంగా మార్చబోతున్నాం.

విశాఖలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో రెండు రోజుల్లోనే 13 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చాయి. అది కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , యువ నాయకుడు నారా లోకేష్ కృషి ఫలితంగానే రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొంది. గత ఐదేళ్లు కమిషన్ల కోసం పెట్టుబడులని తరిమేస్తే నేడు కాళ్లకు చక్రాల కట్టుకొని తిరిగి మరి పెట్టుబడులు సాధిస్తున్నాం. గత ఐదేళ్లలో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులను తరిమేశారు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ ఏపీలో సుమారు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి దానికి ముందుకొచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు బ్రాండ్. పెట్టుబడులను ఆకర్షించడం కోసం 25 పాలసీలు తీసుకొచ్చాం. చట్టాల్లో మార్పులు చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాం. పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం. ప్రకాశం జిల్లాలో రెన్యువబుల్ ఎనర్జీకి ఉన్న అవకాశాలపై కూడా ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బి.ఎన్.విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి , ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రాంబాబు రాజు , మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *