-ఈనెల 28,29,30 తేదీల్లో డిపార్ట్మెంటల్ పరీక్షలు
-డిఆర్ఓ యం.వెంకటేశ్వర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ ఇంజినీర్లు ఎంపిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక బిషప్ అజరయ్య బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన పరీక్షల నిర్వహణ తీరును ఆదివారం డిఆర్ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ పరీక్షలకు 32 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 28,29,30 తేదీల్లో నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏపీపీఎస్సీ,రెవిన్యూ అధికారులతో డియర్ఓ సమీక్షించారు. ఈ పరీక్షల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు, కలెక్టరేట్ ఏవో వెన్నెల శ్రీను ,హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్యామ్ నాధ్ తదితరులు పాల్గొన్నారు