Breaking News

ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత యూపీఎస్సి సివిల్స్ కోచింగ్ కి ముగిసిన ప్రవేశ పరీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు డా. బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ కోసం మొత్తం 6, 361మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు విశాఖ, విజయవాడ, తిరుపతి అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో (10.12.2025 నుంచి 10.04.2026 వరకు) 4 నెలల పాటు అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి శిక్షణ అందించనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *