విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేరళ రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ ఎండీ జయకృష్ణ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఈరోజు విజయవాడలోని కానూరు సివిల్ సప్లై భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సివిల్ సప్లై వ్యవస్థలో కొనసాగుతున్న సంస్కరణలు, వినియోగదారుల సేవల మెరుగుదల, ధాన్యం కొనుగోలు విధానాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ ఢిల్లీ రావు, IAS మరియు కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్. గోవిందరావు, IAS కూడా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News