* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* పంచాయతీరాజ్ లో నూతన సంస్కరణలు హర్షణీయం
* ఒకే గొడుగు కిందకు అన్ని కార్యాలయాలు
* డీడీవో కార్యాలయాలతో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు
* డిప్యూటీ సీఎం పవన్ సేవలు ప్రశంసనీయం
* అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి పవన్ సమ ప్రాధాన్యం
* ప్రజావేదికను జగన్ కూలిస్తే…
* పాలనా సౌలభ్యం కోసం మేం కార్యాలయాలు నిర్మిస్తున్నాం… : మంత్రి సవిత
* డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించి మంత్రి సవిత
* డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి
పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీ రాజ్ వ్యవస్థలో నూతన సంస్కరణలతో కూటమి ప్రభుత్వం పాలనను ప్రజల చెంతకు చేర్చిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి డీడీవో కార్యాలయాలు మంచి వేదికలవుతాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. డివిజనల్ స్థాయిలో అన్ని కార్యాలయాలనూ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల అటు ప్రజలకు, ఇటు పాలనకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. తమ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం కార్యాలయాలు నిర్మిస్తుంటే, ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చిన ఘనత జగన్ ది అని విమర్శించారు. పెనుకొండలో గురువారం నిర్వహించిన నూతన డీడీవో కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, పంచాయతీ రాజ్ వ్యవస్థలో సంస్కరణ నాంది పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివనందనలు తెలుపుతూ, ఈ నిర్ణయం ఎంతో చారిత్రాత్మకమని కొనియాడారు. డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల అటు ప్రజలకు, ఇటు పాలనకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. డీడీవో కార్యాలయాలు మినీ కలెక్టరేట్లగా ప్రజా సమస్యల పరిష్కారానికి మంచి వేదికలవుతాయన్నారు. డీడీవో కార్యాలయాలకు శాశ్వత భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కు మంత్రి సవిత సూచించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
డిప్యూటీ సీఎం పవన్ స్ఫూర్తి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పనితీరే తమ స్ఫూర్తి అని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కాలువలు, గోకులం షెడ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమానికి,అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఆ శాఖ ఉద్యోగుల ఉన్నతి కోసం పదోన్నతలు కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. తాము చిరకాలంగా కోరుతున్న ప్రమోషన్లు రావడంతో పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎంతో ఆనందంగా ఉన్నారని, కూటమి ప్రభుత్వం పట్ల, డిప్యూటీ సీఎం పట్ల వారు ఎంతో కృతజత చూపుతున్నారని వివరించారు. మరింత నిబద్ధతతో పనిచేసి డిప్యూటీ సీఎంకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తామని చెబుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు కార్యాలయానికి వచ్చిన మంత్రి సవితకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం కార్యాలయ ఆవరణలో మంత్రి సవిత మొక్క నాటారు.
జగన్ కూలిస్తే…మేం నిర్మిస్తున్నాం…
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. డివిజన్ స్థాయిలో ఉన్న అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ… డీడీవో కార్యాలయాను మినీ క కలెక్టర్లగా రూపొందిస్తోందని తెలిపారు. ఇలా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండడం వల్ల పాలనా సౌలభ్యం కలుగడమే కాకుండా ప్రజా సమస్యలకు కూడా తక్షణ పరిష్కారాలు లభిస్తాయన్నారు. 2014-19 మధ్య రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆనాడు గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులతో వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం రావడంతో, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కేంద్ర నుంచి నిధులు తీసుకురావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను జగన్ కూలిస్తే… పాలన సౌలభ్యం, ప్రజా సమస్యల పరిష్కారాల కోసం నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, డీడీవో రామకృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News